మిక్స్ వెజిటేబుల్ దహి కడీకూరగాయ మరియు పెరుగువంటకం , కొద్దిగా చిక్కగా, కొద్దిగా కారంగా మరియు మొత్తం చాలా రుచికరం, ఉప్పుడు బియ్యం అన్నంతో ఇది చాల బావుంటుంది
కూరగాయ మరియు పెరుగువంటకం , కొద్దిగా చిక్కగా, కొద్దిగా కారంగా మరియు మొత్తం చాలా రుచికరం, ఉప్పుడు బియ్యం అన్నంతో ఇది చాల బావుంటుంది
Ingredients
- 2కప్పుల పెరుగు
- 2 టేబుల్ స్పూన్ల శనగ పిండి
- 1 టేబుల్ స్పూన్ నూనె
- 1 టీ స్పూన్ ఆవాలు
- అర చెంచా జీలకర్ర గింజలు
- 1 ఎండు మిర్చి
- 1 చిటికెడు ఇంగువ
- 6-8 కరివేపాకు ఆకులు
- 1 టీ స్పూన్ కారం పేస్ట్
- 2 చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్
- 1 కప్పు మిశ్రమ కూరగాయలు (ఫ్రెంచ్ బీన్స్, క్యారెట్, గుమ్మడికాయ)
- 1 చెంచా మవానా సూపర్ ఫైన్ షుగర్
- రుచి కొరకు ఉప్పు
- 2 కప్పుల నీళ్ళు
- కొత్తిమీర ఆకులు
Preparations

- ఒక గిన్నెలో పెరుగు వేసి బాగా గిలకొట్టాలి ఇప్పుడు శనగ పిండి జత చేసి పెరుగులో కలిసేటట్లు కలపాలి
- ఒక పాన్/బాణిలి లో నూనె వేడి చేయాలి ఆవాలు, జీలకర్ర, ఎండు మిరపకాయ, ఇంగువ, కరివేపాకు, కారం పేస్ట్, అల్లం వెల్లులి పేస్ట్ అన్నీ అందులో కలిపి వేగనివ్వాలి. మిశ్రమ కూరగాయలు, మావానా సూపర్ ఫైన్ షుగర్, ఉప్పు వేసి కలిసేటట్లు బాగా కదపాలి
- పెరుగు మరియు శనగ పిండి మిశ్రమాన్ని బాణలిలో పోయాలి. కొంచెం నీటితో పైన తడపాలి మరియు అన్నింటినీ కలపడానికి కదిలించాలి కడీ ని ఒకసారి మరగనివ్వాలి మరియు కరివేపాకు మరియు ఆవపిండిని కలపాలి కొత్తిమీరతో అలంకరించి వేడిగా వడ్డించండి
